నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా || Nee Kante Nammadagina || Telugu Christian Songs#నీకంటెనమ్మదగిన
#Neekante
#Neekantenammadagina
#TeluguChristiansongs
#jesussongstelugu
#Telugugospelsongs

నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా
నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా (2)
మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా
కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా ||నీకంటె||

కొట్టబడిన వేళ
నా గాయం కట్టినావే (2)
బాధించినా స్వస్థపరిచేది నీవే (2) ||నీకంటె||

అణచబడిన వేళ
నా తలను ఎత్తినావే (2)
శిక్షించినా గొప్ప చేసేది నీవే (2) ||నీకంటె||

విడువబడిన వేళ
నను చేరదీసినావే (2)
కోపించినా కరుణ చూపేది నీవే (2) ||నీకంటె||

source