యేసూ నన్ ప్రేమించితివి | Hebron songs in telugu | telugu Christian songs


యేసూ నన్ ప్రేమించితివి | Hebron songs in telugu | telugu Christian songs

Please Subscribe my Channel for more songs

పల్లవి : యేసూ నన్ ప్రేమించితివి – ఆశ్రయము లేనప్పుడు
నీ శరణు వేడగానే – నా పాపభారము తొలగె

1. నే దూరమైతి నీకు – నశియించితి లోకమున
నేను గ్రహించలేదు – నీ హృదయ ప్రేమను
|| యేసూ ||

2. నే తలచలే దెప్పుడు – నా అంత మేమవునని
నా పాపములచే నేను – నిన్ను విసిగించితిని
|| యేసూ ||

3. నిన్ను నేగాంచగానే – నా జీవితము మారెను
నేనెంతో గ్రుచ్చబడి – నిన్నంగీకరించితి
|| యేసూ ||

4. రక్షణ దొరికె నాకు రక్తముతో నన్ను కడిగి
రయముగా నీ చెంతకు – రక్షకా తెచ్చితివి
|| యేసూ ||

5. పరిశుద్ధులలో చేర్చి – పరమ స్వాస్థ్యము నిచ్చి
పూర్ణాధికారము నిచ్చి – పరలోకము తెరచితివి
|| యేసూ ||

source