యెహోవాను స్తుతియించు –ప్రభువును ఘనపరచు
మహా దేవుని సేవించు – యేసుని పూజించు (2)
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
బలవంతుడైన నిత్యుడగు తండ్రి(2)
సమాధానకర్త అయిన రారాజును
ఆత్మతోను సత్యముతోను –బలముతోను మనసుతోను
కరములు తట్టి కేకలు వేసి –గంతులు వేసి నాట్యము చేసి
కలిగున్నదంతటితోను యెహోవాను స్తుతియించు ||యెహోవాను||
ఆకాశ మహిమలు ఆయనను స్తుతియించు
భూలోక సంపూర్ణత ఆయనను స్తుతియించు
తన చేతి క్రియలన్ని ఆయనను స్తుతియించు
పిల్లనగ్రోవితో ఆయనను స్తుతియించు
నీ చేతులెత్తి పరిశుద్ధ సన్నిధిలో ||ఆత్మతోను||
స్వరమండలముతో ఆయనను స్తుతియించు
సితార స్వరములతో ఆయనను స్తుతియించు
గంభీర ధ్వనితో మ్రోగెడి తాళముతో
తంబుర నాట్యముతో తంతి వాద్యముతో
జీవమున్న ప్రతి ప్రాణి ఆయనను స్తుతియించు ||ఆత్మతోను||