ఆధారం నాకు ఆధారం
నాకు తోడునీడై ఉన్న నీ కృపయే ఆధారం
ఆశ్రయమూ నాకు ఆశ్రయమూ
ఆపత్కాలమందు ఆశ్రయమూ నీ నామం ఆశ్రయమూ
తల్లితండ్రి లేకున్నా – బంధుజనులు రాకున్నా
లోకమంత ఒకటైనా – బాధలన్ని బంధువులైనా ||ఆధారం||
భక్తిహీన బంధంలో నేనుండగా
శ్రమల సంద్రంలో పడియుండగా (2)
ఇరుకులో విశాలతనూ కలిగించిన దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||
దారిద్య్రపు సుడినుండి ఐశ్యర్యపు తీరానికి
నీ స్వరమె నా వరమై నడిపించిన యేసయ్యా (2)
విడువను ఎడబాయనని పలికిన నా దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||
దిగులుపడిన వేళలలో దరిచేరిన దేవా
అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా (2)
చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా (2)
నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగ రావా (2) ||ఆధారం||