ఆకాశ పక్షులను చూడండి Song Lyrics

ఆకాశ పక్షులను చూడండి
అవి విత్తవు అవి కోయవు
గరిసెలలో దాచుకోవూ
కొట్లలో కూర్చుకోవు ||ఆకాశ||

అనుదినము కావలసిన ఆహారము
అందజేయును వాటికి ఆ దేవుడు
కలసికట్టుగా అవి ఎగిరి పోతాయి
కడుపు నింపుకొనిపోయి మరల తిరిగి వస్తాయి ||ఆకాశ||

స్వార్ధము వంచన వాటికుండదు
సాటివాని దోచుకొనే మనసు ఉండదు
రేపటిని గూర్చిన చింత ఉండదు
పూట ఎలా గడపాలని బాధ ఉండదు ||ఆకాశ||

పక్షులను పోషించే ఆ దేవుడు
మనుష్యులను పోషించుట మానివేయునా
సృష్టిలోన మనిషి బ్రతుకు శ్రేష్టము కదా
ప్రభువు తోడు ఉండగా మనకు ఎందుకు బాధ ||ఆకాశ||

ఆకాశ పక్షులను చూడండి telugu christian video song


ఆకాశ పక్షులను చూడండి Song Lyrics