ఆనందం నీలోనే Song Lyrics

ఆనందం నీలోనే – ఆధారం నీవేగా
ఆశ్రయం నీలోనే – నా యేసయ్యా – స్తోత్రార్హుడు
అర్హతేలేని నన్ను – ప్రేమించినావు
జీవింతు ఇలలో – నీ కోసమే – సాక్ష్యార్థమై ||ఆనందం||

పదే పదే నిన్నే చేరగా
ప్రతిక్షణం నీవే ధ్యాసగా (2)
కలవరాల కోటలో – కన్నీటి బాటలో (2)
కాపాడే కవచంగా – నన్ను ఆవరించిన
దివ్యక్షేత్రమా – స్తోత్రగీతమా ||ఆనందం||

నిరంతరం నీవే వెలుగని
నిత్యమైన స్వాస్థ్యం నీదని (2)
నీ సన్నిధి వీడక – సన్నుతించి పాడనా (2)
నీకొరకే ధ్వజమెత్తి నిన్న ప్రకటించనా
సత్యవాక్యమే – జీవవాక్యమే ||ఆనందం||

సర్వసత్యమే నా మార్గమై
సంఘక్షేమమే నా ప్రాణమై (2)
లోక మహిమ చూడక – నీ జాడలు వీడక (2)
నీతోనే నిలవాలి నిత్య సీయోనులో
ఈ దర్శనం – నా ఆశయం ||ఆనందం||

ఆనందం నీలోనే telugu christian video song


ఆనందం నీలోనే Song Lyrics