ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా
నవజీవన మార్గమునా – నన్ను నడిపించుమా
ఊహించలేనే నీ కృపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ||ఆశ్రయ||
లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే
ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ||
నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ||
పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద (2)
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి (2) ||ఆశ్రయ||
నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది (2)
స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా (2) ||ఆశ్రయ||