ఆత్మ విషయమై Song Lyrics

ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు
పరలోక రాజ్యము వారిది (2)

దుఃఖ పడు వారలు ధన్యులు
వారు ఓదార్చబడుదురు (2)
సాత్వికులైన వారు ధన్యులు
వారు భూలోకమును స్వతంత్రించుకొందురు (2) ||ఆత్మ||

నీతిని ఆశించువారు ధన్యులు
వారు తృప్తిపరచబడుదురు (2)
కనికరము గలవారు ధన్యులు
వారు దేవుని కనికరము పొందుదురు (2) ||ఆత్మ||

హృదయ శుద్ధి గలవారు ధన్యులు
వారు దేవుని చూచెదరు (2)
సమాధాన పరచువారు ధన్యులు
వారు దేవుని కుమారులనబడుదురు (2) ||ఆత్మ||

ఆత్మ విషయమై telugu christian video song


ఆత్మ విషయమై Song Lyrics