ఏ భాషకందని భావం నీవు
వెలకట్టలేని ముత్యం నీవు
దేవుడిచ్చిన వరమే నీవు తీర్చలేని ఓ ఋణం
ఎదలో దాగిన పలుకే నీవు నా ప్రేమకు తొలిరూపం
అమ్మా నిను మించిన బంధం ఏదియు లేదే
లోకంలో ఈ తీయని బంధం కానరాలేదే
నవ మాసాలు నీలో నన్ను దాచావు
నా ఊపిరికి ప్రాణం పణంగా పెట్టావు
రేయి పగలంతా నాకై శ్రమపడినా
తీరని అనురాగం నీలో దాచావే
నీ సుఖ సంతోషం వదిలిన నాకై
తరగని మమకారం నీలో చూసానే
యేసయ్య ప్రేమే నిన్ను నాకై సృష్టించిందే
అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే
లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే
భయ భక్తులే ఉగ్గి పాలుగా పోసావు
దేవుని మాటలే గోరు ముద్దగా చేసావు
తప్పటడుగులే నాలో సరి చేసి
ప్రభు సన్నిధిలో నన్ను సాక్షిగా నిలిపావు
ప్రతి వేకువలో నాకై నీవు
చేసే ప్రార్థనలే పెంచెను నా బలమే
నీలో కలిగిన విశ్వాసం నాతో సహవాసించెనే
అమ్మా నిను మించిన బంధం ఇలలో లేనే లేదే
లోకంలో ఈ తీయని బంధం కానరానే లేదే ||ఏ భాషకందని||