అందమైన క్షణము ఆనందమయము
యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము
యేసయ్య పుట్టినవేళ సంబరమే సంబరము (2)
బంగారు సొగసు కన్నా బహు అందగాడు (2)
బోళము సాంబ్రాణి కన్నా బహు సుగంధుడు
సంబరమే సంబరము శ్రీ యేసు జననము
సర్వ జగతికి మహా సంతోషము
సర్వ సృష్టికి ముందే దేవుడేర్పరిచిన
శాశ్వత జీవం ఈ ప్రభు యేసే
శాశ్వత జీవం ఈ ప్రభు యేసే
బలమైన యోధుడు దేవాది దేవుడు
దీన నరుడై మనకై పుట్టాడు
మన గాయములకు కట్టు కట్టి
మన బ్రతుకులను వెలుగుతో నింపిన
దైవతనయుని కొలువ రావా
సందేహించకు ఓ సోదరా
రక్షణ మార్గము కోరి రావా
సంశయమెందుకు ఓ సోదరా… ఓ సోదరీ… ||సంబరమే||
పాప విమోచన నిత్య జీవం
సిలువలోనే మనకు సాధ్యం
సిలువ భారం తాను మోసి
మన దోషములను తుడిచేసాడు
సిలువ చెంతకు చేర రావా
జాగు ఎందుకు ఓ సోదరా
యేసు నామము నమ్మ రావా
జాగు ఎందుకు ఓ సోదరా… ఓ సోదరీ… ||సంబరమే||