అత్యున్నత సింహాసనముపై (యేసన్న) Song Lyrics

అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవ దూతలు ఆరాధించు పరిశుద్ధుడా
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసేదా
సాగిలపడి నమస్కారము చేసేదా (2)

ప్రతి వసంతము నీ దయా కిరీటమే
ప్రకృతి కలలన్నియు నీ మహిమను వివరించునే (2)
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞాతార్పణలతో – కృతజ్ఞాతార్పణలతో (2) ||అత్యున్నత||

పరిమలించునే నా సాక్ష్య జీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే (2)
పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్ష ధ్వనులతో –హర్ష ధ్వనులతో (2) ||అత్యున్నత||

పక్షి రాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివే నా బాధ్యతలు భరించితివే (2)
యెహోవ నిన్నే మహిమ పరచెద
స్తుతి గీతాలతో –స్తుతి గీతాలతో (2) ||అత్యున్నత||

అత్యున్నత సింహాసనముపై (యేసన్న) telugu christian video song


అత్యున్నత సింహాసనముపై (యేసన్న) Song Lyrics