బాల యేసుని జన్మ దినం Song Lyrics

బాల యేసుని జన్మ దినం
వేడుకైన శుభ దినము
సేవింప రారే జనులారా
ముద్దుల బాలకు ముద్దులిడ ||బాల||

మరియమ్మ ఒడిలో ఆడెడి బాలుని
చిన్నారి చిరునవ్వు లొలికెడి బాలుని (2)
చేకొని లాలింప రారే
జో జోల పాటలు పాడి ||బాల||

పాపికి పరమ మార్గము జూప
ఏతెంచి ప్రభువు నరునిగా ఇలకు (2)
పశుశాలయందు పవళించే
తమ ప్రేమను జూపింప మనకు ||బాల||

మన జోల పాటలు ఆలించు బాలుడు
దేవాది దేవుని తనయుడు గనుక (2)
వరముల నొసగి మనకు
దేవుని ప్రియులుగా జేయు ||బాల||

బాల యేసుని జన్మ దినం telugu christian video song