భక్తులారా స్మరియించెదము Song Lyrics

భక్తులారా స్మరియించెదము
ప్రభు చేసిన మేలులన్నిటిని (2)
అడిగి ఊహించు వాటి కన్నా మరి (2)
సర్వము చక్కగ చేసె (2) ||భక్తులారా||

గాలి తుఫానులను గద్దించి
బాధలను తొలగించే (2)
శ్రమలలో మనకు తోడైయుండి
శ్రమలలో మనకు తోడైయుండి
బయలు పరచె తన జయమున్ (2) ||భక్తులారా||

ఈ భువియందు జీవించు కాలం
బ్రతికెదము ప్రభు కొరకే (2)
మనమాయనకర్పించుకొనెదము
మనమాయనకర్పించుకొనెదము
ఆయన ఆశయమదియే (2) ||భక్తులారా||

కొంచెము కాలమే మిగిలియున్నది
ప్రభువును సంధించుటకై (2)
గనుక మనము నడచుకొనెదము
గనుక మనము నడచుకొనెదము
ప్రభు మార్గముల యందు (2) ||భక్తులారా||

భక్తులారా స్మరియించెదము telugu christian video song


భక్తులారా స్మరియించెదము Song Lyrics