భూమియు దాని సంపూర్ణత Song Lyrics

భూమియు దాని సంపూర్ణత లోకము
దాని నివాసు లెహోవావే (2)

ఆయన సముద్రము మీద దానికి పునాది వేసెను (2)
ప్రవాహజలముల మీద దానిని స్థిరపరచెను (2) ||భూమియు||

యెహోవా పర్వతమునకు నెక్కదగిన వాడెవ్వడు (2)
యెహోవా పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవ్వడు (2) ||భూమియు||

వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు (2)
నిర్దోషచేతులు శుద్ధ హృదయము కలిగినవాడే (2) ||భూమియు||

నిన్నాశ్రయించి నీ సన్నిధిని వెదకెడి వాడు (2)
వాడాశీర్వాదము నీతి మత్వము నొందును (2) ||భూమియు||

గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి పురాతనమైన తలుపులారా (2)
మహిమగల రాజు ప్రవేశించునట్లు మిమ్మును లేవనెత్తికొనుడి (2) ||భూమియు||

మహిమగల యీ రాజెవడు? బలశౌర్యముగల ప్రభువే (2)
యుద్ధశూరుడైన యెహోవా పరాక్రమముగల ప్రభువే (2) ||భూమియు||

మహిమగల యీ రాజెవడు? సైన్యముల యెహోవాయే (2)
ఆయనే యీ మహిమగల రాజు హల్లెలూయా ఆమెన్ (2) ||భూమియు||

భూమియు దాని సంపూర్ణత telugu christian video song


భూమియు దాని సంపూర్ణత Song Lyrics