చీకటి లోయలో Song Lyrics

చీకటి లోయలో నేను పడియుండగా
నీవే దిగి వచ్చి నను కనుగొంటివి
మరణపు గడియలో నేను చేరియుండగా
నీ రక్తమిచ్చి నను బ్రతికించితివి
నీవే.. దేవా నేవే.. నీవే నీవే
నా ప్రాణ దాతవు నీవే ప్రభు
చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు
ఎత్తైన కొండ పైకి నను చేర్చు ప్రభు

అరణ్యములలో నేను పయనించినను
ఏ అపాయమునకిక భయపడను
నీవే నా మార్గమని నిను వెంబడించెదను
నా చేయి పట్టి నను నడిపించుము
నీకే.. దేవా నీకే.. నీకే నీకే
నా సమస్తము నీకే అర్పింతును
చేర్చు.. దేవా చేర్చు.. నన్ను చేర్చు
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు

ఆకలి దప్పులు లేని.. శ్రమలు అలసటలు లేని
శోధన ఆవేదన లేని.. భయము దుఃఖము లేని
మరణం కన్నీరు లేని.. చీకటి ప్రవేశం లేని
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు

సకల సమృద్ధి ఉండు.. దూతల స్తుతిగానాలుండు
భక్తుల సమూహముండు.. మహిమ ప్రవాహముండు
నిత్యం ఆరాధన ఉండు.. నిరతం ఆనందముండు
నా తండ్రి ఇంటికి నను చేర్చు ప్రభు

చీకటి లోయలో telugu christian video song


చీకటి లోయలో Song Lyrics