చెప్పనా చెప్పనా యేసు నీ ప్రేమను
చూపనా చూపనా మార్చిన బ్రతుకును
గుండెల్లో గుడి కట్టి యేసయ్యకివ్వనా
ప్రాణమే పెట్టిన ఈ ప్రేమ మరుతునా (2) ||చెప్పనా||
చీకటి రాత్రిలో చీరు దీపమైన లేక
ఏ ఒడ్డుకు చేరుతానో తెలియని వేళ
కంటినిండ కన్నీళ్ళతో బరువెక్కిన గుండెతో
అయిపోయిందంతా అనుకున్నవేళ
నా చేయి పట్టావు నా వెన్నుతట్టావు
నేనున్నానని నన్ను నిలబెట్టావు ||చెప్పనా||
నిందలన్ని తొలగించి ఆనందము నాకిచ్చి
బాధ కలుగు దేశమందు బలమిచ్చావు
ఒంటరైన నన్ను చేర్చి పదివేలుగ నన్ను మార్చి
అవమానము తొలగించి బలపరిచావు
అంతులేని ప్రేమ చూపి హద్దులేని కృపనిచ్చి
నీ చల్లని నీడలో నను దాచావు ||చెప్పనా||