చూచితి నీ మోముపై Song Lyrics

చూచితి నీ మోముపై – చిందిన రక్తము
తలచితి నీ ప్రేమను – మదికి అందనిదాయె
రాజ మకుటము మారిపోయే – ముళ్ల మకుటముగా
సింహాసనమే సిలువగ మారి – శిక్షకు గురియాయేగా
పరిమితి లేని కలువరి ప్రేమను – పరిహాసము చేసిరే
ఆ ప్రేమనెరిగి నీ పాద సేవయే – చాలని నీ చెంత చేరితిని
యేసు.. ||చూచితి||

నేలపై ఒలికిన నీ రక్తధారలే – ప్రతి పాపిని కడిగెను
ఆ రక్తధారలే పాపికి మార్గమై – పరముకు ప్రవహించెను (2)
మట్టి దేహమును – మహిమగ మార్చుటకు (2)
మాపై నీకున్న సంకల్ప ప్రేమను – పరిహాసము చేసిరే (2)
యేసు.. ||చూచితి||

సిలువలో చిందిన రక్తపు జల్లులు – ప్రతి రోగిని తాకెను
చితికిన దేహమున ఒలికిన రుధిరము – పరమౌషధమాయెను (2)
మా రోగములను – భరియించుటకు (2)
మాపై నీకున్న ఎనలేని ప్రేమను – అవహేళన చేసిరే (2)
యేసు.. ||చూచితి||

చూచితి నీ మోముపై telugu christian video song


చూచితి నీ మోముపై Song Lyrics