చూచుచున్నాము నీ వైపు Song Lyrics

చూచుచున్నాము నీ వైపు
మా ప్రియ జనక – చూచుచున్నాము నీ వైపు
చూచుచు నీ ప్రేమ – సొంపు సువార్తను
జాచుచు గరములు – చక్కగా నీవైపు ||చూచు||

మేమరులమై యుంటిమి
మార్గము వీడి – మేమందరము పోతిమి
ప్రేమచే నప్పుడు – ప్రియ తనయు నంపించి
క్షేమ మార్గము మాకు – బ్రేమను జూపితివి ||చూచు||

నిను నమ్ము పాపులకు
వారెవరైనా – నీ శరము జొచ్చువారలకు
ఇనుడవు కేడెంబు – నీ జగతిలో నగుచు
గనుపరచుచుందువు – ఘనమైన నీ కృప ||చూచు||

నీ భయము మాయెదలను
నిలుపుము నీదు – ప్రాభవ మొనరంగను
నీ భయముచే మేము – వైభవ మొందుచు
నే భయము లేకుండ – నీ భువిని గొన్నాళ్ళు ||చూచు||

దయ జూచి మము నెప్పుడు
మంచివి యన్ని – దయచేయు మెల్లప్పుడు
దయచేయరానివి – దయచేయుమని కోర
దయ జూపి మన్నించు – దయగల మా తండ్రి ||చూచు||

చూచుచున్నాము నీ వైపు telugu christian video song


చూచుచున్నాము నీ వైపు Song Lyrics