చూపుల వలన కలిగేది ప్రేమ కాదమ్మా
ఆకర్షణకు లొంగిపోయి బానిస కాకమ్మా
చూపుల వలన కలిగేది ప్రేమ కాదురా
ఆకర్షణకు లొంగిపోయి బానిస కాకురా
స్వార్ధ్యంతోనే నిండియున్నది లోక ప్రేమరా
సత్యమైనది పవిత్రమైనది యేసు ప్రేమరా (2)
తల్లిదండ్రులు నిన్ను గొప్ప చేయాలని
కష్టించి చెమటోడ్చి డబ్బంతా నీకే పెడితే (2)
కన్నందుకు కన్నీరేనా ప్రతిఫలం
పద్దు గీసుకోవటమా నీ జీవితం (2)
వ్యర్ధమైనవాటిని విడిచి
పరమార్ధంలోకి నడిచి
దైవ యేసు వాక్యం స్వీకరించుమా (2) ||చూపుల||