క్రిస్మస్ మెడ్లీ 2 Song Lyrics

నర జన్మమెత్తి వరసుతునిగా
అరుదెంచె నేడు సరసముగా
శ్రీ వేల్పుడగు ఆనందమూర్తి
క్రీస్తేసు స్వామి ఈ భువిలోన
మానసవేది పావనమూర్తి
మానవులను పాలించుకర్త
నర జన్మమెత్తి…

లోకముద్ధరింప పరిశుద్ధ జన్మ
మెత్తి కన్య మరియ గర్భవతియాయే (2) ||మానసవేది||

బంతి యనగ యాడరే మన
బాల చిన్న ముద్దుల యేసుకు (2)
ముత్తిక తోడ కూడి యాడి
ముద్దుల పరుడు పల్క పరుడు

గ గ గ రి గ మ మ మ మ
ప మ ప మ ప ద ని స (2)
ప ద ని స.. ప ద ని స..
ప ద ప ద గ మ గ మ గ రి స రి ||బంతి||

జ్ఞానులెల్ల వచ్చిరి
మంచి కానుకలర్పించిరి (2) ||ముత్తిక||

జననము నొందెను జయ యేసు
జయ గీతములు పాడుడి (2)
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

గొర్రెల కాపరులకు దూత
గొప్ప వార్తను తెలిపినట (2) ||జననము||

శ్రీ యేసుండు జన్మించే రేయిలో (2)
నేడు పాయక బేత్లెహేమ యూరిలో (2)

సత్రమందున పశువుల శాలయందున (2)
దేవపుత్రుండు మనుజుండాయెనందున (2) ||శ్రీ యేసుండు||

చూడబోదాము రారే
సకల జనంబులార
శ్రీ యేసు నాథుని జన్మంబు (2)
ఆనందముతో మనమందరం (2) ఆహ ||చూడబోదాము||

ఘల్లు ఘల్లున మనమెల్లి యేసుని
పాదంబు జంబులకు మ్రొక్కెదము (2) ||ఆనందముతో||
ఆహ చూడ… ఆహ చూడ…
ఆహ చూడబోదాము రారే
సకల జనంబులార
శ్రీ యేసు నాథుని జన్మంబు (2)

క్రిస్మస్ మెడ్లీ 2 telugu christian video song


క్రిస్మస్ మెడ్లీ 2 Song Lyrics