దేవ దాసపాలక Song Lyrics

దేవ దాసపాలక రాజా రావే
జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా
దేవా దేవా దీన పోషకా ||దేవ||

లోక బాధ ఇరుకు శోధన నుండి
స్వీకరించినావు త్రియేక దేవుడా
స్తోత్రం స్తోత్రం స్తోత్రమర్పణ ||దేవ||

దిక్కులేని పాపి కొరకు నీ దేహం
మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా
జయం జయం జయము నొందగా ||దేవ||

కఠినులంత కుటిలము జేసి నిన్ను
గట్టి కొట్టి నెట్టి నీకు గొయ్య నెత్తిరా
యిదే నా యెడ బ్రేమ జూపితి ||దేవ||

ఇంత యొర్పు యింత శాంతమా నాకై
పంతముతో బాపికొరకు బ్రాణమియ్యగా
పాపి నీదగు దాపు జేర్చవే ||దేవ||

కలువరి గిరి వరంబున నాకై
తులువను నా కొరకు నిలను సిల్వ మోయగా
హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ||దేవ||

దేవ దాసపాలక telugu christian video song


దేవ దాసపాలక Song Lyrics