దిక్కులన్ని నీవేలే – దిక్కులన్ని నీవేలే (2)
ఎక్కడో నిన్ను వెదక – ఏలనయ్య ఓ స్వామీ (2)
నిత్యమై నాలోన – జీవమై నీవుండ ||దిక్కులన్ని||
లెక్క మిక్కిలి ప్రాణులెన్నో ఈ జగతినుండగా
లెక్క మాలిన నన్ను నీవు నీ పోలిక చేయగా (2)
నిక్కముగా నర జన్మ – ధన్య చరితాయనే (2)
చక్కనయ్య త్యాగానాన – చావు కూడా సత్తేలే ||దిక్కులన్ని||
దిక్కులేని దారిలోన నన్ను నీవు నడుప
దిక్కు నీవై ప్రక్కనుండి మొక్కుచుందు దేవా (2)
భాష రాని నా నోట – పాడుకుందు నీ పాట (2)
హీనమైన రూపానాన – గానమై యేసన్న ||దిక్కులన్ని||