దివి నుండి భువికి రారాజుగా
బేత్లెహేము పురముకు ఏతెంచెను (2)
గ్రామమంతా చిరునవ్వు లొలికె
పట్టణమంతా పండుగ చేసె (2)
సర్వలోకము సంబరమాయె (2)
ఆశ్చర్యకరుడు హల్లెలూయ
ఆలోచనకర్త హల్లెలూయ
బలమైన దేవుడు హల్లెలూయ
నిత్యుడగు తండ్రి హల్లెలూయ
సమాధానకర్త హల్లెలూయ
గొల్లలు జ్ఞానులు పరవశులై
బంగారం సాంబ్రాణి బోళమును (2)
సాష్టాంగపడి తమ హృదయములన్
ప్రభువుకు కానుకలర్పించిరి
మనము కూడా అర్పించెదం
ప్రభువు నామము ఘనపరచెదం
మనము కుడా సాష్టాంగపడుచు
పరవశించుచు పాడెదము ||ఆశ్చర్యకరుడు||
పాపము శాపము బాపగను
వేదన శోధన తీర్చగను (2)
పరిశుద్ధుడు జన్మించెనని
ఇహమున పరమున కొనియాడెదం
మనము కూడా కొనియాడెదం
ప్రభువు నామం ఘనపరచెదం
మనము కూడా హోసన్నయనుచు
కరములెత్తి పాడెదము ||ఆశ్చర్యకరుడు|| ||గ్రామమంతా||