దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా
దిగి రానైయున్న మహరాజువు నీవయ్యా
మొదటివాడవు – కడపటివాడవు
యుగయుగములలో ఉన్నవాడవు (2)
మానక నా యెడల కృప చూపుచున్నావు
మారదు నీ ప్రేమ తరతరములకు (2)
మాట తప్పని మహనీయుడవు – మార్పులేని వాడవు
నీవు చెప్పిన మంచి మాటలు – నెరవేర్చువాడవు
నీ మాటలు జీవపు ఊటలు
నీ కృపలే బలమైన కోటలు (2) ||దివినేలు||
దాచక నీ సంకల్పము తెలియజేయుచున్నావు
దయనొందిన నీ జనుల ముందు నడుచుచున్నావు (2)
దాటి వెళ్లని కరుణామూర్తివై – మనవి ఆలకించావు
దీర్ఘ శాంతముగలవాడవై – దీవించువాడవు
నీ దీవెన పరిమళ సువాసన
నీ ఘనతే స్థిరమైన సంపద (2) ||దివినేలు||
సీయోను శిఖరముపై నను నిలుపుటకే
జ్యేష్ఠుల సంఘముగా నను మార్చుటకే (2)
దివ్యమైన ప్రత్యక్షతతో – నన్ను నింపియున్నావు
సుందరమైన నీ పోలికగా – రూపు దిద్దుచున్నావు
నీ రాజ్యము పరిశుద్ధ నగరము
ఆ రాజ్యమే నిత్య సంతోషము (2) ||దివినేలు||