ఏగెదను నే చేరెదను
సీయోనును నే చూచెదను (2)
విశ్వాస కర్తయైన నా యేసూ (2)
నీ సముఖములో నే మురిసెదను
నీ కౌగిలిలో ఉప్పొంగెదను (2)
జీవ కిరీటమును నే పొందెదను ||ఏగెదను||
భూదిగంతములకు నీ కాడిని – నే మోయుచున్నాను
యేసూ నీ యొద్దనే నాకు – విశ్రాంతి దొరుకును (2)
దినదినము నాలో నే చనిపోవుచున్నాను
అనుదినము నీలో బ్రతుకుచున్నాను (2)
అనుదినము నీలో బ్రతుకుచున్నాను ||ఏగెదను||
నా ఆత్మీయ పోరాటములో దేవా – నీవే నా కేడెము
సదా నిన్నే నేను ధరియించి – సాగిపోవుచున్నాను (2)
మంచి పోరాటముతో నా పరుగును
కడముట్టించి జయమొందెదను (2)
విశ్వాసములో జయమొందెదను ||ఏగెదను||