ఎంతో భాగ్యంబు Song Lyrics

ఎంతో భాగ్యంబు శ్రీ యేసు దొరికెను
మనకెంతో భాగ్యంబు
వింతైన తన మహిమనంత విడచి మన కొరకై
చింతలన్నియు బాపుటకెంతో దీనుడాయె ||ఎంతో||

పరలోకమును విడచి మనుజ కుమారుడయ్యె
నరుల బాంధవుడయ్యా కరుణా సముద్రుండు ||ఎంతో||

బాలుడయ్య తన జనకుని – పని నెరిగిన వాడయ్యే
ఈ లోకపు జననీ జనకులకెంతో లోబడనే ||ఎంతో||

పెరిగెను జ్ఞానమందు – మరియు దేహ బలమందు
పరమేశుని దయయందు నరుల కనికరమందు ||ఎంతో||

ఎంతో భాగ్యంబు telugu christian video song


ఎంతో భాగ్యంబు Song Lyrics