ఎరుగనయ్యా నిన్నెప్పుడు Song Lyrics

ఎరుగనయ్యా నిన్నెప్పుడు (2)
నను వెదకుచుంటివా.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా||

నీ ప్రేమ శాశ్వతమేగా (2)
నీ కరుణ సాగరమేగా (2)
నిను కొలువ భాగ్యమే కదా (2)
నను పిలువ వచ్చిన.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా||

నీ పలుకే తీర్చునాకలి (2)
నీ స్మరణము కూర్చు బలిమిని (2)
నీ బ్రతుకే వెలుగు బాట (2)
నను కొలువ వచ్చిన.. ఓ ప్రభువా (2) ||ఎరుగనయ్యా||

వలదయ్యా లోక భ్రాంతి (2)
కడు భారము ఘోర వ్యాధి (2)
నిను చేరిన నాకు మేలు (2)
నీ రక్షణ చాలు చాలు.. నా ప్రభువా (2) ||ఎరుగనయ్యా||

ఎరుగనయ్యా నిన్నెప్పుడు telugu christian video song


ఎరుగనయ్యా నిన్నెప్పుడు Song Lyrics