గూడు లేని గువ్వలా Song Lyrics

గూడు లేని గువ్వలా దారి తప్పితి
గుండె చెదరిన కోయిలనై మూగబోయితి (2)
నీ గుండెలో దాచుమా
నీ గూటికే చేర్చుమా (2)
నా ప్రాణమా నా క్షేమము నీవయ్యా
నా క్షేమమా నా ప్రాణము నీవయ్యా ||గూడు||

గువ్వలకు గూళ్ళిష్టం – కోయిలకు పాటిష్ఠం
నాకేమో నువ్విష్టం – నీ సన్నిధి ఇష్టం (2)
నువ్వంటే ఇష్టం యేసయ్యా
నువ్వు లేకుంటే బ్రతుకే కష్టమయ్యా (2) ||నా ప్రాణమా||

చేపలకు నీళ్ళిష్టం – పిల్లలకు తల్లిష్టం
నీకేమో చెలిమిష్టం – నా స్నేహం ఎంతో ఇష్టం (2)
నేనంటే నీకెంతో ఇష్టమయ్యా
నీవెంటుంటే ఇంకా ఇష్టమయ్యా (2) ||నా ప్రాణమా||

గూడు లేని గువ్వలా telugu christian video song


గూడు లేని గువ్వలా Song Lyrics