గూడు లేని గువ్వనై Song Lyrics

గూడు లేని గువ్వనై – కూడు లేని బిడ్డనై (2)
నీడ లేని మనిషినై – అందరిలో ఒంటరినై (2)
దారి తెలియని స్థితిలో నిలబడి ఉన్నాను
సహాయము కొరకు ఆర్జిస్తు ఉన్నాను (2)

అప్పుడొక మెల్లని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రభువైన యేసుని (2)
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా జీవితమంత ప్రకాశింప సాగింది (2) ||గూడు||

అప్పుడొక తియ్యని స్వరము నాతో
మాట్లాడి చెప్పెను ప్రియుడైన యేసుని (2)
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా పాప జీవితము పారిపో సాగింది (2) ||గూడు||

అప్పుడొక అద్భుత స్వరము నాతో
మాట్లాడి చెప్పెను రాజైన యేసుని (2)
ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో నేను
నా ప్రశ్నలన్నిటికి జవాబులు దొరికాయి (2)

గూడు ఉన్న గువ్వనై – కూడు ఉన్న బిడ్డనై (2)
నీడ ఉన్న మనిషినై – ఒక్కరిలో వెయ్యినై (2)
దారి తెలిసిన స్థితిలో నిలబడి ఉన్నాను
సేవలోని మాధుర్యము ననుభవిస్తున్నాను (2)

యేసుని నమ్ముకో – యేసుని చేరుకో
యేసుని కోరుకో – యేసుతో చేరిపో (4)

గూడు లేని గువ్వనై telugu christian video song


గూడు లేని గువ్వనై Song Lyrics