హల్లెలూయా యేసు ప్రభున్ Song Lyrics

హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతియించుడి
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి
బలమైన పని చేయు బలవంతుని స్తుతియించుడి
ఎల్లరిని స్వీకరించు యేసుని స్తుతియించుడి

రాజుల రాజైన యేసు రాజు భూజనులనేలున్
హల్లెలూయా, హల్లెలూయా దేవుని స్తుతియించుడి

తంబురతోను వీణతోను ప్రభువుని స్తుతియించుడి
పాపమును రక్తముతో తుడిచెను స్తుతియించుడి
బూరతోను తాళముతో మ్రోగించి స్తుతియించుడి
నిరంతరము మారని యేసుని స్తుతియించుడి ||రాజుల||

సూర్య చంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి
హృదయమును వెలిగించిన యేసుని స్తుతియించుడి
అగ్నివడగండ్లార మీరు కర్తను స్తుతియించుడి
హృదయమును చేధించిన నాథుని స్తుతియించుడి ||రాజుల||

యువకులారా పిల్లలారా దేవుని స్తుతియించుడి
జీవితమున్ ప్రభుపనికై సమర్పించి స్తుతియించుడి
పెద్దలారా ప్రభువులారా యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునకై అర్పించి స్తుతియించుడి ||రాజుల||

అగాథమైన జలములారా దేవుని స్తుతియించుడి
అలలవలె సేవకులు లేచిరి స్తుతియించుడి
దూతలారా పూర్వ భక్తులారా దేవుని స్తుతియించుడి
పరమందు పరిశుద్ధులు ఎల్లరు స్తుతియించుడి ||రాజుల||

హల్లెలూయా యేసు ప్రభున్ telugu christian video song


హల్లెలూయా యేసు ప్రభున్ Song Lyrics