ఇదియేనయ్య మా ప్రార్థన Song Lyrics

ఇదియేనయ్య మా ప్రార్థన
ఇదియే మా విజ్ఞాపన
ఆలకించే దేవా
మము నీ ఆత్మతో నింపగ రావా (2)

నీ వాక్యములో దాగియున్న
ఆంతర్యమును మాకు చూపించయ్యా
నీ మాటలలో పొంచియున్న
మర్మాలను మాకు నేర్పించయ్యా (2)
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా||

నీ దృష్టిలో సరిగా జీవించే
మాదిరి బ్రతుకును మాకు దయచేయయ్యా
నీ సృష్టిని మరిగా ప్రేమించే
లోబడని మా మనసులు సరిచేయయ్యా (2)
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా||

నీ సువార్తను గొప్పగ చాటే
బెదరని పెదవులు మాకు ఇవ్వుము దేవా
నీ సేవలో తప్పక కొనసాగే
అలుపెరుగని పాదములు నొసగుము ప్రభువా (2)
నీ జ్ఞానమే మా వెండి పసిడి
నీ ధ్యానమే మా జీవిత మజిలి (2) ||ఆలకించే దేవా||

ఇదియేనయ్య మా ప్రార్థన telugu christian video song


ఇదియేనయ్య మా ప్రార్థన Song Lyrics