జాలిగల దైవమా Song Lyrics

జాలిగల దైవమా యేసయ్యా
మనసారా స్తుతింతున్‌ స్తోత్రింతును
నీవు దేవుడు సర్వశక్తుడు (2)
నీ జాలికి హద్దులే లేవు
నీ ప్రేమకు కొలతలే లేవు (2)
అవి ప్రతిదినము క్రొత్తగా నుండున్‌ (2) ||జాలిగల||

నిజముగ మా యొక్క పాపములన్‌ మోసికొని
దుఃఖములను భరించితివే (2)
అయ్యా – దుఃఖములను భరించితివే ||నీవు||

మా కొరకు సమాధానమిచ్చుటకై దండనంత
నీపైన పడెనే ప్రభూ (2)
అయ్యా – నీపైన పడెనే ప్రభూ ||నీవు||

మాదు అతిక్రమములచే గాయపడి నలిగితివే
గాయములచే స్వస్థమైతిమి (2)
నీదు – గాయములచే స్వస్థమైతిమి ||నీవు||

జాలిగల దైవమా telugu christian video song