జగతికి వెలుగును తెచ్చెనులే Song Lyrics

జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్
వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్
రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్
మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2)

ఈ రాత్రిలో కడు దీనుడై
యేసు పుట్టెను బెత్లెహేములో (2)
తన స్థానం పరమార్ధం విడిచాడు నీకై
నీ కోసం నా కోసం పవళించే పాకలో (2) ||జగతికి||

ఇమ్మానుయేలుగా అరుదించెను
దైవ మానవుడు యేసు దేవుడు (2)
నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడు
ఏ లోటు ఏ కీడు రానీయదు ఎన్నడు (2) ||జగతికి||

జగతికి వెలుగును తెచ్చెనులే telugu christian video song


జగతికి వెలుగును తెచ్చెనులే Song Lyrics