జన్మించె.. జన్మించె..
యేసయ్యా పశువుల పాకలోనా.. ఓ.. ఓ ..
హల్లెలూయ.. హల్లెలూయ..
హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..
రాత్రివేళ గొల్లలు గొర్రెలు కాయుచుండగా
దేవదూత వచ్చి శుభవార్తను తెల్పెను (2)
సంతోషించి ఆనందించి
యేసును చూచి పరవశించి (2)
లోకమంతా శుభవార్తను ప్రకటించిరి
హల్లెలూయ.. హల్లెలూయ..
హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..
ఆకాశములో ఒక తార జ్ఞానుల కొరకు వెలసెను
యేసు పుట్టిన స్థలమునకు నడిపించెను (2)
బంగారు సాంబ్రాణి బోళం
బాల యేసునికి అర్పించి (2)
మనసార పూజించి కొనియాడిరి
హల్లెలూయ.. హల్లెలూయ..
హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు
తన కిష్టులకు సమాధానము కల్గును గాక (2)
పశువుల పాకలో జన్మించిన యేసయ్యా
మన హృదయంలో జన్మించుటే క్రిస్మస్ పండుగా (2)
హల్లెలూయ.. హల్లెలూయ..
హల్లెలూయ.. క్రిస్మస్ ఓ.. ఓ..