కాలం సమయం నాదేనంటూ Song Lyrics

కాలం సమయం నాదేనంటూ అనుకుంటున్నావా
రోజులు అన్ని నావేనంటూ జీవిస్తున్నావా (2)
దేవుని ముందు నిలిచే రోజుంది
తక్కెడ తూకం వేసే రోజుంది (2)
జీవ గ్రంథం తెరిచే రోజుంది
నీ జీవిత లెక్క చెప్పే రోజుంది
ఆగవేమయ్యా ఈ మాట వినవయ్యా
ఆగవేమయ్యా నీ మనస్సు మార్చుకోవయ్యా (2) ||కాలం||

ధనము బలము ఉన్నదని విర్రవీగుతున్నావా
మేడలు మిద్దెలు ఉన్నాయని అనుకుంటున్నావా (2)
గుజరాతును చూడవయ్యా ఎంత ఘోరమో
ఒక్క ఘడియలెందరో బికారులయ్యారు (2) ||ఆగవేమయ్యా||

చూసావా భూకంపాలు కరువులు విపరీతాలు
పరిశుద్ధ గ్రంథములోని కడవరి కాలపు సూచనలు (2)
నిన్నటి వరకు కొదువ లేదని అనుకున్నారు
ఒక్క ఘడియలో ఎందరో నశించిపోయారు (2) ||ఆగవేమయ్యా||

సిద్ధపడిన వారి కోసం పరలోకపు ద్వారాలు
సిద్ధపడని వారికి ఆ నరకపు ద్వారాలు (2)
అగ్ని ఆరదు పురుగు చావదు
నిత్యం ఏడుపు దుఃఖాలు (2) ||ఆగవేమయ్యా||

కాలం సమయం నాదేనంటూ telugu christian video song


కాలం సమయం నాదేనంటూ Song Lyrics