కలములతో రాయగలమా Song Lyrics

కలములతో రాయగలమా
కవితలతో వర్ణించగలమా
కలలతో వివరించగలమా
నీ మహోన్నతమైన ప్రేమా(2)
ఆరాధింతును(4)
రారాజువు నీవే
నా తండ్రివి నీవే
నిను విడువను ఎడబాయను (2)

ఆకాశములు నీ మహిమను
వివరించుచున్నవి
అంతరిక్షము నీ చేతి పనిని
వర్ణించుచున్నది (2)

దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును||

సెరాపులు కెరూబులు
నిత్యము నిను స్తుతియించుచున్నవి
మహా దూతలు ప్రధాన దూతలు
నీ నామము కీర్తించుచున్నవి (2)

దేవా నా ప్రాణము
నీ కొరకై తపియించుచున్నది (2) ||ఆరాధింతును||

కలములతో రాయగలమా telugu christian video song


కలములతో రాయగలమా Song Lyrics