కలుగును గాక – దేవునికి మహిమ – కలుగును గాక
కలుగు నున్నతమైన – ఘన స్థలములందున
నిలకు సమాధానం – నరుల కాయన దయ ||కలుగును||
ప్రభువైన దేవా – పరమరాజా – సర్వపరిపాలా
పరిపూర్ణ శక్తిగల– పరమ జనక నిన్ను
మహిమ స్తుతించుచు – మరి పొగడుచున్నాము ||కలుగును||
మహిమపర్చుచు – ఆరాధించు – చున్నాము నిన్ను
మహిమాతిశయమును – మది దలంచియు నీకు
మహిని మా స్తుతి కృత – జ్ఞత నిచ్చు చున్నాము ||కలుగును||
ఏక కుమారా – యేసు ప్రభువా – యెహోవా తనయా
లోక పాపము మోయు – ఏక దేవుని గొఱ్రె
పిల్ల మమ్మును కనిన – రించుము చల్లగ ||కలుగును||
పరిశుద్ధుడవు – ప్రభుడవు నీవో – ప్రభువైన క్రీస్తూ
పరిశుద్ధాత్మతో తండ్రి – యైన దేవునియందు
బరిపూర్ణ మహిమతో – బ్రబలుచున్నామామేన్ ||కలుగును||