కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా (2)
విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా (2)
యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా (2) ||కలువరి||
కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా (2)
కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా (2)
ముళ్ళతోన మకుటమల్లి
నీదు శిరమున నుంచినా – (2) ||కలువరి||
జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా (2)
మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా (2)
కలుష రహిత వ్యధను చెంది
అలసి సొలసి పోతివా – (2) ||కలువరి||