కన్నీరే మనిషిని బాధిస్తుంది Song Lyrics

కన్నీరే మనిషిని బాధిస్తుంది
ఆ కన్నీరే మనసును ఓదారుస్తుంది (2)
కన్నీరే కాదనుకుంటే
ఓదార్పే కరువైపోతుంది (2) ||కన్నీరే||

కన్నీరే మరియను బాధించింది
ఆ కన్నీరే మరణము గెలిపించింది (2)
కన్నీరే కాదనుకుంటే
లాజరు తిరిగి బ్రతికేనా (2)
కన్నీరే వలదనుకుంటే
దేవుని మహిమ కనిపించేనా (2) ||కన్నీరే||

కన్నీరే హన్నాను బాధించింది
ఆ కన్నీరే కుమారుని దయచేసింది (2)
కన్నీరే కాదనుకుంటే
సమూయేలు జన్మించేనా (2)
కన్నీరే వలదనుకుంటే
దేవుని కృపను గాంచేనా (2) ||కన్నీరే||

కన్నీరే మనిషిని బాధిస్తుంది telugu christian video song


కన్నీరే మనిషిని బాధిస్తుంది Song Lyrics