కన్నులుండి చూడలేవ Song Lyrics

కన్నులుండి చూడలేవ యేసు మహిమను
చెవులుండి వినలేవ యేసు మాటను (2)
నాలుకుండి పాడలేవ యేసు పాటను
కాళ్ళు ఉండి నడువలేవ యేసు బాటను ||కన్నులుండి||

చెడును చూడకుండ నీ కనులను
చెడును వినకుండ నీ చెవులను (2)
చెడును పలుకకుండ నీ నాలుకన్
చెడులో నడువకుండ నీ కాళ్ళను
దూరముగా నుంచు ఓ సోదరా
దూరముగా నుంచు ఓ సోదరీ (2) ||కన్నులుండి||

దుష్టుల ఆలోచన చొప్పునా
నడువక సాగుమా నీ యాత్రలో (2)
పాపుల మార్గమందు నీవు నిలువక
అపహాసకులు కూర్చుండు చోటను
కూర్చుండకుమా ఓ సోదరా
కూర్చుండకుమా ఓ సోదరీ (2) ||కన్నులుండి||

యెహోవా దొరుకు కాలమందునా
ఆయనను మీరు వెదక రండి (2)
ఆయన మీ సమీపమందు నుండగా
ఆయననూ మీరు వేడుకొనండి
ఆయన తట్టు తిరుగు ఓ సోదరా
ఆయన తట్టు తిరుగు ఓ సోదరీ (2) ||కన్నులుండి||

కన్నులుండి చూడలేవ telugu christian video song


కన్నులుండి చూడలేవ Song Lyrics