కృతజ్ఞతన్ తలవంచి Song Lyrics

కృతజ్ఞతన్ తలవంచి
నాదు జీవము అర్పింతును
లేదే ఇక-నే ఈవి ఇల
అర్పింతును నన్నే నీకు (2)

దూరమైతి నీ ప్రేమ మరచి
నే రేపితి నీ గాయముల్ (2)
దూరముగా నిక వెళ్ళజాల
కూర్చుండెద నీ చెంతనే (2) ||కృతజ్ఞతన్||

ఆకర్షించే లోకాశాలన్ని
లోక మహిమ నడ్డగించు (2)
కోర్కెలన్నీ క్రీస్తు ప్రేమకై
నిక్కముగా త్యజింతును (2) ||కృతజ్ఞతన్||

తరముల నీ ప్రేమ నాకై
వర్ణింపను అశక్యము (2)
నిరంతరము సేవించినను
తీర్చలేను నీ ఋణము (2) ||కృతజ్ఞతన్||

కృతజ్ఞతన్ తలవంచి telugu christian video song


కృతజ్ఞతన్ తలవంచి Song Lyrics