లాలి లాలి జోలాలి Song Lyrics

లాలి లాలి జోలాలి – బాల యేసునకు లాలి
కన్య మరియా తనయునకు – పాడ రండి జోలాలి (2)
లోక రక్షకునకు లాలి – శాంతి కర్తకు జోలాలి (2)
మాదు తండ్రికి మా లాలి (2) ||లాలి||

చీకటి దొంతరల తెరలకు – తెరను దింపగా వచ్చినావని
పాప శాపపు తాపములకు – రక్షణను ఇల తెచ్చినావని (2)
మానవుల మోచకుడా లాలి – ధరణిఁ పై దైవమా జోలాలి (2)
మాదు తండ్రికి మా లాలి (2) ||లాలి||

దారి తెలియని మానవాళికి – దారి నీవై వెలసినావని
మరణ ఛాయలు రూపుమాపగ – జీవ కిరణమై మెరిసినావని (2)
సత్య రూపునకు లాలి – నీతి సూర్యునకు జోలాలి (2)
మాదు తండ్రికి మా లాలి (2) ||లాలి||

లాలి లాలి జోలాలి telugu christian video song


లాలి లాలి జోలాలి Song Lyrics