మానవులందరు ఒక్కటేనని Song Lyrics

మానవులందరు ఒక్కటేనని
మదిలో మన దేవుడు ఒక్కడేనని (2)
అందరు అందురు – వీనుల విందుగా (2)
(మరి) లోకాన జరిగేది మార్పుగా (2) ||మానవులందరు||

క్రీస్తు సిలువకు సాక్షులమందురు
సాక్ష్యములిచ్చినా సాకులు మానరు (2)
ప్రార్ధనకొచ్చినా పాపం మానరు (2)
ప్రభువేల వానిని క్షమియించును
మరి వారేల క్షమియింపబడుదురు ||మానవులందరు||

మార్పులు చెందినా మాటలు మారవు
మనుషులు కలిసినా మనసులు కలువవు (2)
చేతులు కలిపినా హృదయం కలవదు (2)
పైపైకి వందనంబులనుదురు
మరి వారేల నీతిమంతులవుదురు ||మానవులందరు||

మానవులందరు ఒక్కటేనని telugu christian video song


మానవులందరు ఒక్కటేనని Song Lyrics