మార్గం సత్యం జీవం నీవే యేసు
సర్వం సకలం నీవే క్రీస్తు (2)
మా ఆధారం నీవేనయ్యా
మా అనుబంధం నీతోనేనయ్యా (2)
వధియింపబడిన ఓ గొర్రెపిల్ల
ప్రభువైన మా యేసువా
మా స్తుతి స్తోత్రముల్ నీకే
మహిమా ప్రభావముల్ నీకే (2) ||మార్గం||
పరమును విడిచావు మాకై
నరునిగా పుట్టావు ధరపై (2)
ఆహా నీదెంత ప్రేమ
ఎవరికైనా వర్ణింప తరమా (2) ||వధియింప||
కలువరిలో రక్తమును కార్చి
విలువగు ప్రాణమును ఇచ్చి (2)
తెచ్చావు భువికి రక్షణ
ఇచ్చావు పాప క్షమాపణ (2) ||వధియింప||