మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం
అమరం అతి విజయం – నీ సిలువ రక్తమే విజయం
ఇమ్మానుయేలుడ నీ ప్రేమ మధురం – నీకే నా వందనం (2)
మధురం మధురం – నీ ప్రేమే అతి మధురం (2) ||మధురం||
నా శిక్షకై నా నిందలకై – ప్రాణము పెట్టిన ప్రేమ
నిందలు నిట్టూర్పులు – సేదదీర్చిన ప్రేమ (2)
సర్వోన్నతుడా సహాయకుడా
మరువగలనా నీ ప్రేమను (2) ||మధురం||
సత్యమును నాకు కేడెమును – ధరియింప చేసిన ప్రేమ
కనికరమును కలిగించగను – కల్వరికేగిన ప్రేమ (2)
మహోన్నతుడా మహా ఘనుడా
మరువగలనా నీ ప్రేమను (2) ||మధురం||