మహిమ నీకే ఘనత నీకే Song Lyrics

మహిమ నీకే ఘనత నీకే – నీతి సూర్యుడా (2)
న్యాయాధిపతియైన నా యేసయ్యా – నీకే ఆరాధన (2)
ధనవంతులను అణచేవాడవు
జ్ఞానులను సిగ్గుపరచువాడవు (2)
దరిద్రులను లేవనెత్తువాడవు – నీవే రాజువు (2)
యుద్ధవీరుడా శూరుడా
లోకాన్ని గెలిచిన యేసయ్యా (2)

మార్గమే తెలియని అబ్రహామును – అనేకులకు తండ్రిగా చేసినావు
నెట్టివేయబడిన యోసేపుచే – అనేకులను కాపాడినావు ||దరిద్రులను||

గొఱ్ఱెలకాపరియైన దావీదును – అనేకులకు రాజుగా చేసినావు
నోటి మాంద్యముగల మోషేచే – అనేకులను నడిపించినావు ||దరిద్రులను||

మహిమ నీకే ఘనత నీకే telugu christian video song


మహిమ నీకే ఘనత నీకే Song Lyrics