మహోన్నతమైన సీయోనులోన Song Lyrics

మహోన్నతమైన సీయోనులోన సదా కాలము
నా యేసయ్యతో జీవించుటే (2) – నా ఆశ (2)
విరిగిన మనస్సు నలిగిన హృదయం
నాకు కావాలయ్యా..
యేసయ్యా నాకు కావాలయ్యా (2)
ఆరాధనా ఆరాధనా (2)
ఆరాధనా ఆరాధనా (2) ||మహోన్నతమైన||

లోకమంతయు నష్టముగా ఎంచి
సంపాదించుకొంటిని – నా యేసయ్యను నేను (2)
బ్రతుకు మూలమునైనా – చావు మూలమునైనా (2)
ఘనపరతును నా దేవుని
స్తుతియింతును నా దేవుని – (2) ||విరిగిన||

మహా మహిమతో నీవొచ్చు సమయమున
కన్నులారా చూచెదను – నా యేసయ్యను నేను (2)
హింస మూలమునైనా – కరువు మూలమునైనా (2)
సంతోషింతును నా యేసుతో
ప్రకాశింతును ఆ మహిమలో – (2) ||విరిగిన||

మహోన్నతమైన సీయోనులోన telugu christian video song


మహోన్నతమైన సీయోనులోన Song Lyrics