మమ్మెంతో ప్రేమించావు
మా కొరకు మరణించావు
మేమంటే ఎంత ప్రేమో మా యేసయ్యా
నీకు – నీ ప్రేమ ఎంత మధురం మా యేసయ్యా (2)
ఆ ఆ ఆ… ఆ ఆ – హల్లెలూయా ఆ ఆ ఆ…
హల్లెలూయా ఆ ఆ ఆ – హల్లెలూయా ||మమ్మెంతో||
మా బాధ తొలగించావు – మా సాద నీవు తీర్చావు
మము నడుపుమా దేవా – మము విడువకెన్నడూ (2)
మము విడువకెన్నడూ ||మమ్మెంతో||
మా కొరకు దివి విడిచావు – ఈ భువిని ఏతెంచావు
పాపులను రక్షించావు – రోగులను నీవు ముట్టావు (2)
రోగులను నీవు ముట్టావు ||మమ్మెంతో||