మనసారా పూజించి Song Lyrics

మనసారా పూజించి నిన్నారాధిస్తా
భజనలు చేసి నిన్ను ఆరాధిస్తా
చప్పట్లు కొట్టి నిన్ను స్తోత్రాలు చేసి నేను
సంతోష గానాలను ఆలాపిస్తా (3) ||మనసారా||

నిన్న నేడు ఉన్నవాడవు నీవు (2)
ఆశ్చర్యకార్యములు చేసేవాడవు నీవు (2)
పరమతండ్రీ నీవే గొప్ప దేవుడవు (2)
నీదు బిడ్డగా నన్ను మార్చుకున్నావు (2) ||మనసారా||

రక్షణ కొరకై లోకానికి వచ్చావు (2)
సాతాన్ని ఓడించిన విజయశీలుడవు (2)
మరణము గెలిచి తిరిగి లేచావు (2)
నీవే మర్గము సత్యము జీవము (2) ||మనసారా||

మనసారా పూజించి telugu christian video song


మనసారా పూజించి Song Lyrics