మంచిని పంచే దారొకటి
వంచన పెంచే దారొకటి
రెండు దారులలో నీ దారి
ఎంచుకో బాటసారి
సరి చూసుకో ఒక్కసారి (2)
మొదటి దారి బహు ఇరుకు – అయినా యేసయ్యుంటాడు
ప్రేమా శాంతి కరుణ – జనులకు బోధిస్తుంటాడు (2)
పాపికి రక్షణ తెస్తాడు
పరలోక రాజ్యం ఇస్తాడు (2)
అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యా
విశాల మార్గం వద్దయ్యా ||మంచిని||
మరియొక దారి విశాలం – కాని సాతానుంటాడు
కామం క్రోధం లోభం – నరులకు నేర్పిస్తాడు (2)
దేవుని ఎదిరిస్తుంటాడు
నరకాగ్నిలో పడదోస్తాడు (2)
అందుకే.. ఇరుకు దారిలో వెళ్ళయ్యా
విశాల మార్గం వద్దయ్యా ||మంచిని||